ప్రేమమూర్తి అమ్మ;- -గద్వాల సోమన్న,9966414580
పూల పాన్పులా మెత్తన
సూర్య కాంతిలా వెచ్చన
ఆదర్శమూర్తి అమ్మ ఒడి
అక్షరాల  ప్రేమ బడి

మంచు రీతిలో చల్లన
మల్లెపూవులా తెల్లన
త్యాగమయి అమ్మ మనసు
అందరికది తెలుసు తెలుసు

జీవితంలో దీవెన
అనురాగాల వంతెన
పరిశీలించగా తల్లి
కుటుంబాన పాలవెల్లి

అడుగడుగునా స్వాంతన
అమ్మయే మధుర భావన
సాటిలేనిది త్యాగము
కరుణకామె ప్రతి రూపము


కామెంట్‌లు