ఆడపిల్ల హాయిగా ఉండనీ!!..- -గద్వాల సోమన్న,9966414580
ఆడపిల్ల అవనిలో
మొక్కలా ఎదగనీ!
సదన గగనసీమలో
చుక్కలా వెలగనీ!

గొప్ప గొప్ప చదువులతో
వాణిలా మారనీ!
అండదండలతోడ
రాణిలా జీవించనీ!

కన్నవారి నీడలో
మిన్నగా ఫలించనీ!
మమకారపు తోటలో
పూవులా విరియనీ!

అనుకున్న లక్ష్యంలో
నిబ్బరంగా ఉండనీ!
ఆశయాల సాధనలో
అలుపెరుగక  సాగనీ!

కీచకుల లోకంలో
దమ్ముతో ఎదురించనీ!
ఆకతాయి వానరుల
దుమ్ము కాస్త దులుపనీ!


కామెంట్‌లు