మ(ఘ)న తెలుగు పదాలు- -గద్వాల సోమన్న,9966414580.
చూపు చూపు దమ్ము
రేపు రేపు దుమ్ము
చేయకోయి వమ్ము
స్వయంకృషిని నమ్ము

వద్దు వద్దు అప్పు
తగలబెట్టు నిప్పు
తెచ్చిపెట్టు ముప్పు
దూరమున్న ఒప్పు

దాటరాదు హద్దు
నిర్లక్ష్యం వద్దు
చురుకుదనం ముద్దు
అదే మేలి ప్రొద్దు

పాప మనసు వెన్న
పసిడి కన్న మిన్న
గృహమున లేకున్న
ఆనందము సున్న

పరిమళించు మల్లి
ఇంటిలోన చెల్లి
మాకు చిట్టి తల్లి
చూడ పాలవెల్లి

వదల వద్దు  పట్టు
విజయానికి మెట్టు
భుజం భుజం తట్టు
చేరుకొనుము గట్టు


కామెంట్‌లు