వసుధైక కుటుంబం;- -గద్వాల సోమన్న,9966414580
కుటుంబమే ముఖ్యము
ఉంటేనే సౌఖ్యము
మానవ జీవితాన
అత్యంత అవసరము

విశ్వమే కుటుంబము
విశ్వశాంతి కేంద్రము
మనమంతా ఒక్కటి
లేదంటే చీకటి

కలసిమెలసి ఉంటే
గెలుపిక మన వెంటే
సమాజ  శ్రేయస్సుకు
కృషి సల్పు కడవరకు

చెరిగిన కుటుంబాలు
చిరిగిన కాగితాలు
సర్దుబాటు ఉంటే
అగునోయ్! కాగడాలు


కామెంట్‌లు