నీతి వాక్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
కృతజ్ఞత గొప్పగుణం
కృతఘ్నత చెడ్డ వ్రణం
మేలుకు ప్రతిగా కీడు
చేయుటే నీచగుణం

కృతజ్ఞతాభావంతో
బ్రతుకుటే ఘనం ఘనం
ప్రేమానురాగాలతో
సాగాలి క్షణం క్షణం

మంచి చేసిన వారిని
ఏమాత్రం మరవద్దు
ముంచిన వారినైతే
దరిదాపుల ఉంచొద్దు

నమ్మిన వారికి మహిని
వెన్నుపోటు పొడవద్దు
ఆశ్రయించిన వారికి
అన్యాయం జరుగొద్దు


కామెంట్‌లు