అనుభవాల అద్దం- -గద్వాల సోమన్న,9966414580
అందమైన గులాబీలకు
ముళ్ళు ఉంటాయని ఎరుగవా!
జీవితాల్లో  ఆటుపోట్లు
సహజమని తెలుసుకోలేవా!

కష్టానికి ఫలితము తప్పక
ఉంటుందని విశ్వసించవా!
అమావాస్య పిదప పున్నమి
అరుదెంచునని గుర్తించవా!

మితిలేని  కోరికలు అశాంతికి
కారణమవని గ్రహించవా!
సోమరితనం దారిద్ర్యానికి  
 మూలమని నినదించవా!

దుష్టుల సాంగత్యం చెరుపని
వెంటనే విడిచిపెట్టావా!
మంచిని శోధించి బ్రతుకులో
ఇకనైనా చేర్చుకోవా!

సడలని,విడవని పట్టుదలతో
లక్ష్యాన్ని ఇక చేరుకోవా!
పెద్దవారు చెప్పు మాటల్లో
పరమార్థం మరి మరిచెదవా!

గత కాలపు అనుభవాలతో
గుణపాఠాలు నేర్చుకోవా!
సాగిపోతున్న కాలంతో
జాగ్రత్తగా అడుగులేయవా!


కామెంట్‌లు