హద్దులేని ' కోరికలు '- -గద్వాల సోమన్న,9966414580
మితిమీరిన కోరికలు
అసంతృప్తి కారకులు
మనశ్శాంతిని హరించి
ఆహుతి చేయు జ్వాలలు

దుఃఖానికి హేతువులు
పతనానికి ద్వారాలు
అదుపు లేని కోరికలు
కదంతొక్కు గుర్రాలు

దారం తెగిన పతంగులు
అవుతాయి జీవితాలు
నెమ్మది లేక మనసులు
క్రుంగిపోవు కుటుంబాలు

జయిస్తే కోరికలను
లోకాన్ని గెలిచినట్లే
నిగ్రహిస్తే మనసులను
సమస్తం దొరికినట్లే


కామెంట్‌లు