పద వినోదం- -గద్వాల సోమన్న,9966414580
పనికి రాదు విసుగుదల
ఆపేయును ఎదుగుదల
విజయాలు సాధింప
ఉండాలోయ్! పట్టుదల

నవ్వు ముఖం కళకళ
అదే లేక వెలవెల
వీనులకు విందు కదా!
సెలయేరుల గలగల

ఉరుము ఉరుము పెళపెళ
మెరుపు మెరియు తళ తళ
ఆకలితో కడుపులు
మాడునోయి మలమల

నూనె కాగు సలసల
నీరు పారు జలజల
సదనంలో పిల్లల
చిరునవ్వులు కిలకిల


కామెంట్‌లు