అక్షర సత్యాలు-ఆణిముత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
ఆలోచనలు మంచివైతే
అంతా మేలు జరుగుతుంది
పట్టిందంతా బంగారం
భావి జీవితం మనోహరం

హృదయాలే శుద్ధమైతే
ఆశీర్వదాలు కోకొల్లలు
వాక్కు శుద్ధి జరిగిందంటే
అక్షరాల  నెరవేరుతుంది

మనసును జయించినట్లైతే
సమస్తమూ పాదాక్రాంతం
అసాధ్యమైనదేమైనా
ఇక ఉండునా! జీవితాన

అన్నింటికీ మూలమైనది
మనసే ఆధారమైనది
అది గనుక స్వాధీనమైతే!
మనిషి మహిని మహా విజేతే!
కామెంట్‌లు