పసిపాప-చిరు దీప;- -గద్వాల సోమన్న,9966414580
పసిపాప పలుకుల్లో
అమృతమ్ము కురిసింది
అందాల కళ్లల్లో
వెన్నెలే వెలసింది

బుడిబుడి నడకల్లో
హంసమ్మ కులుకింది
చిన్నారి మోములో
చామంతి విరిసింది

అమాయక చూపుల్లో
ఆనందం పొంగింది
అమ్మ ఒడి పాన్పులో
గువ్వలా ఒదిగింది

పాపాయి ఇంటిలో
దీపమై వెలిగింది
కన్నోళ్ల కంటిలో
రూపమై మెరిసింది


కామెంట్‌లు