గణిత పరీక్షల్లో మెట్టూరు విద్యార్థుల ప్రతిభ.
 శ్రీకాకుళం గణిత ఉపాధ్యాయుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్ష, క్విజ్ పోటీలలో మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.
మండల స్థాయి సీనియర్ క్విజ్ విభాగంలో ప్రథమ స్థానాన్ని,  జూనియర్ క్విజ్ పోటీలలో తృతీయ స్థానాన్ని ఈపాఠశాల విద్యార్థులు సాధించారు.
అదేవిధంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలో  ఏడవ స్థానాన్ని 9వ తరగతి విద్యార్థి టి.ఉదయకుమార్ సాధించాడు.
పదో తరగతి విద్యార్థులు 
బి.సాయిచరణ్, బి.జశ్వంత్ లు టాపర్స్ గా నిలిచారు. వీరిని శ్రీకాకుళం ఉపవిద్యాశాఖాధికారి పగడాలమ్మ, గణిత ఉపాధ్యాయ వేదిక ప్రతినిధులు ప్రశంసాపత్రం జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
తమ ప్రతిభతో పాఠశాలకు, కొత్తూరు మండలానికి పేరు తెచ్చిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు  డి.లక్ష్మీనరసింహ, గణిత ఉపాధ్యాయులు దండు ప్రకాశరావు, సి.హెచ్.లక్ష్మి, 
కె.స్వాతి తదితరులు అభినందించారు.

కామెంట్‌లు