సుప్రభాత కవిత ; -బృంద
చీకటికి అవల చలిమంటలా
అన్వేషణ పలించిన ఉద్వేగంలా
తప్పిపోయిన పిల్లాడికి
దూరాన కనిపించిన అమ్మలా...

ఎదురు చూసిన ప్రియనేస్తంలా
కదిలి వస్తున్న  సత్యంలా
పోగొట్టుకున్న పెన్నిధిలా ...
ఎదిగి వస్తున్న కొడుకులా

ఎనలేని సంతోషం తెచ్చే 
కబురులా
ఎదనిండిపోయే తృప్తిలా
చేయందుకుని నడిపే తోడులా

గగనపు ముంగిట ముగ్గులా
భువనపు నుదుట బొట్టులా
చేతికి అందిన పంటలా
పాదున కాసిన గుమ్మడిపండులా

వాకిట ఆడే  ముద్దుబిడ్డలా
అందక ఊరించే అపరంజిముద్దలా
వఱువాత వెలిగించిన దేవుడిదీపంలా

అద్భుతంలా ఆగమించే
ఆదిదేవునకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు