తిరుప్పావై ; - వరలక్ష్మి యనమండ్ర
11. పాశురము :

కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్దు శెత్తార్ తిఱ లళియ చ్చెన్లు శెరుచ్చెయ్యుమ్ కుత్త మొన్జిల్లాద కోపలర్ దమ్ పొజ్కొడియే పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్ శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్ ముత్తమ్ పుగున్ధు ముగిల్ వణ్ణన్ పేర్పాడ శిత్తాదే పేశాదే శెల్వప్పెడ్డాట్టి, నీ ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.
***********
11వ పాశురము-భావము-పంచపదులలో
***********
11వ పాశురము భావము

ఆరవ గోపికను నిదుర లేపుట

నీవు ఘనత కల్గిన గొప్పదానవు
లక్షల లేగలు యున్నట్టి దానవు
సంపదలెన్నియో యున్న దానవు
తామసమేలనే నిద్దుర లేవవు
నిద్దురలేవమ్మ ఓ గోపికమ్మా!.. లక్ష్మీ

జ్ఞాన వైరాగ్యములు పొందినదానవు
బంగరు లతవంటి సన్నని దానవు
నల్లని కేశసంపదలు యున్నదానవు
యాదవ కులమున పుట్టినదానవు
తలుపు తీయుమా ఓ గోపికా!... లక్ష్మీ

నిను చూచుటకు నిను పొందుటకు
మేఘశ్యాముడు వచ్చెను నీకడకు
రావలెనమ్మా వ్రతము చేయుటకు
యోగ నిద్రలో యుండుట ఎందుకు
మా పిలుపులు నీవు వినలేదా!.. లక్ష్మీ

నీ వాకిటన అందరు నిలచిరి
శ్రీ కృష్ణుణ్ణి స్తుతించుచుంటిరి
నీవొచ్చినచో నిండుదనమనిరి
కీర్తనలెన్నియొ పాడుచుండిరి
నిద్దుర లెమ్ము ఓఆరవ  గోపికా!.. లక్ష్మీ


కామెంట్‌లు