ఓం ఆదిత్యాయ ;- కొప్పరపు తాయారు
 త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ 
వీర్యవాన్
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ 
సముపాగమత్
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్
అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః 
పరమం ప్రహ్రుష్య మాణః
నిశిచరపతిసంక్షయం విదిత్వా 
సురగణమధ్యగతో వచస్త్వరేతి !
ఇది విన్న రాముడు శోకమును, విచారమును 
వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ 
స్తోత్రమును మూడు మార్లు పఠించి 
సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు 
ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు 
ధరించెను.
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, 
ధైర్యముతో రాముడు రావణుని 
సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత 
నిశ్చయము చేసుకొనెను.
             *********

కామెంట్‌లు