ఓం ఆదిత్యా య' - కొప్పరపు తాయారు
 తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మనే
సమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే
నాశయత్యేష వై భూతం తథైవ సృజతి ప్రభు:
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభిస్తిభి
బంగారమువంటి వన్నెగలవాడవు. ఆహుతులను 
గ్రహించువాడవు. సర్వజగత్కర్తవు. తమస్సులను 
పారద్రోలువాడవు. ప్రకాశస్వరూపుడవు. జగత్తున 
జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. 
కనుక ఓ భాస్కరుడా నీకు నమస్కారము.
రఘునందనా! ఈ ప్రభువే సమస్త ప్రాణులను 
లయమొనర్చును. పిదప సృష్టించి 
పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత 
జగత్తును తపింపజేయును. వర్షములను 
ప్రాసాదించుచుండును.
                             *****

కామెంట్‌లు