చిన్ని- చిన్ని కన్నయ్యా....! ; కోరాడ
చిన్ని చిన్ని కన్నయ్య
చిట్టి చిట్టి పాదాలతో... 
ముచ్చట గా ఆడుగు లేస్తూ
 ముద్దు లొలుకు కన్న య్యా
   మోహ నాంగుడవు నీవు
  నీ రూపము మనో హరము
   
బాల్యము పై మోజు పడి
ఈ ఇలను పుట్టినావ
దేవకీ  నందను డవు
  నందుని కుమారునిగా
 రేపల్లె లో పెరిగినావ...! 
  
ఆలమంద లనిన
గోప బాలు రానిననూ
 పాలు, పెరుగు వెన్న లన్న
  ఎంత ఇష్టము
     నీ కెంత ఇష్టము...! 

వెన్న తిన్న నోటనే.... 
     మన్ను నూ తిన గలవు
  ఆగ్రహించిన అమ్మకు
   నోట సృష్టినంత చూపగలవు

రక్కసులను జమ్పుట
 కాళియ మద మనచుట
గో వర్ధన గిరి నెత్తుట
  బాల్య క్రీ డలే నీకు...! 

బాల్యా నందమును నీవు
 తనివితీర అనుభవించినావా
  ఆ మధుర మైన బాల్యము
  మరలా కావాలందువ....!! 
 నీ లీలలు గని రేపల్లెకు
  ధన్యత చే కూరి నది.... 
ఆ కధ విని మా మనసులు
పులక రించు చున్నవి.....!! 
        ******†*

కామెంట్‌లు