"వృక్షో రక్షతి రక్షితః"- పిట్టల రవిబాబు,-పర్యావరణవేత్త,-హైదరాబాద్
అమ్మ మనకు జన్మనిస్తే....!
ప్రకృతి అమ్మ మనకు ఊపిరిపోసింది....!!

అమ్మ మనకు పాలిచ్చి పెంచితే....!
పకృతి అమ్మ మనకు ప్రాణవాయువునిచ్చి 
దేహాన్ని నిలిపింది, ప్రాణం ఉన్నంతవరకు నిలుపుతూ ఉంది....,

కని పెంచినందుకు అమ్మనైతే పోషిస్తూ, పూజిస్తున్నాం...,
కానీ..
మరి ఊపిరిపోసిన పకృతి అమ్మకు ఏం చేస్తున్నాం....?
తన ఊపిరి నిలయాలను దహించివేస్తున్నాం....!!
హరించి వేస్తున్నాం.... ఇది న్యాయమా?

అందుకే ఇకనైనా మేల్కొందాం....!
ప్రకృతిని, పర్యావరణాన్ని బాధ్యతగా కాపాడుకుందాం....!!

పచ్చని వృక్ష సంపద కలిగిన క్షేత్రమే ప్రకృతి అమ్మ...!!
పకృతి అమ్మను రక్షించక పోతే, 
మానవ మనుగడే లేదు, ప్రమాదం పొంచి ఉంది...!!

"అందుకే వనాలను పెంచుదాం....!!
పకృతి తల్లిని కాపాడుకుందాం....!!
సంతోషంగా జీవిద్దాం....!!
అందుకే అటువైపు అడుగేద్దాం....!!

కామెంట్‌లు