మట్టి వాక్యాలు!!!?;- ప్రతాప్ కౌటిళ్యా
కోట్ల నదులు పారుతున్న అగ్ని మహాసముద్రంలో
సూర్యుళ్ళు కొట్టుకుపోతున్నారు!
సూక్ష్మతీ సూక్ష్మ వెంట్రుకల్లా
రంగుల రంధ్రాలు తెరుచుకుంటున్నవీ సూర్యకిరణాల్లో
నిప్పుల నీళ్లు కళ్ళు తెరుచుకునే లోపే
రెప్పల ద్వారాలు మూతపడుతున్నవీ!!

రేపటి నిప్పుల కుంపటి
పొగ లేకుండానే వేడిని కంటున్నట్లు
వెలుగు వాకిలి ముందు ఎదురుచూస్తుంది.!!

కొంత అలలుగా కొంత తీగలుగా
కొంత కిరణాల కాలువలుగా
వెలుగు పారుతుంది తీరం వెంట!!!
పిసికేసిన అగ్నితో ఎర్ర సముద్రం నల్ల సముద్రం గా మారింది.!!

కోటి జన్మల తర్వాత
జ్వాలలు జ్యోతులుగా మారినట్లు
చీకటి చరిత్ర పుటలు చెప్తున్నాయి!!

నిప్పును దంచి మింగితే
కొలిమిలో దూరిన అగ్ని లావాలా పొంగి
లోహంగా మారుతుంది ఇప్పుడు.!!

అగ్నిశిఖల తెరచాపలు వేడి గాలులకు
ముందుకు సాగుతున్నవి నావల్లా!!

వలలో చిక్కిన చాపల్లా
నిప్పు కనికలు ఎగిరి పడుతున్న వేళ
బాగా కాలిన సూర్యుని
కాలసముద్రంలో ముంచితే
కాకంతా కందిపోయి కరిగిన పొయ్యిలా మారింది.!!!

ఎండమావుల్లా పారుతున్న వేడి
కొండచిలువల్ల దారులన్నింటికీ అడ్డుపడితే
దుప్పట్ల దూళి పొగలు
నిప్పును కప్పి వేస్తున్నవీ!!!

తెల్లారితే తేలిపోయే వెలుగు మేఘాలు
ఎక్కడికో పారిపోకుండా
ఆకాశమంత ఆవిరితో నింపుతున్న
మట్టి పోయ్యి!!!

భూమిని మట్టికుండగా కాల్చిన మంట
ఇప్పుడు మంటను కూడా
కుండలో ఉడికిస్తున్న మట్టి గట్టితనమే
భూమి పుట్టుకకు గుడ్డి గుర్తు!!!!

రాళ్లను సృష్టించిన నిప్పు
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా
మట్టితోనే కప్పబడింది.!!!

బంగారం వెండి ఇనుము బయటపడ్డ
భాగ్యమంత మన్ను లోనే కదా!!!

ఆనాటి మంట మాటలే
నేటి మట్టి వాక్యాలు కథ!!!?

ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు
Jayaho Jaladi చెప్పారు…
ఒక వాక్యం కూడా అర్ధం కాలేదు