ఓర్పు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఎవరైనా ఏదన్నా మాట అన్నా వెంట వెంటనే జవాబు ఇస్తే అవతలివారి కోపం పెరిగి నానారభసకి దారితీస్తుంది.చిలికిచిలికి గాలివాన అవుతుంది.మనం శాంతం మౌనంగా ఉంటే దాన్ని ఓర్పు అంటారు.భీష్ముడు ధర్మరాజు శ్రీరాముడు దీనికి నిదర్శనం ఆదర్శం.కృష్ణుడు కూడా నూరు తప్పులు చేసే దాకా శిశుపాలుడ్ని ఏమీ అనలేదు.
నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా సూరీడు 26 ఏళ్లు కఠినకారాగారశిక్ష అనుభవించిన వ్యక్తి.నల్లజాతివారి కోసం పోరాడారు.మిట్ట మధ్యాహ్నం మండుటెండలో
బండరాళ్లను పగులగొట్టించేవారు జైలు అధికారులు.
చీకటి గదిలో బంధించి ఒక్క సారి వెలుగు లోకి వస్తే
ఆయన కళ్లు కనిపించేవికాదు.చిన్నకాగితంముక్కలపై తన జీవితచరిత్ర రాశారు జైల్లో.అలాగే అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో ఒక గర్విష్టి సభలో  తన బూటు కాళ్లు ఆడిస్తూ "లింకన్! ఇవి మీనాన్న కుట్టిన
బూట్లు.నీవు ఒక చెప్పులు కుట్టే వాడి కొడుకు వి.ఈరోజు అదృష్ట వశాత్తూ ప్రెసిడెంట్ వి ఐనావు" 
అంటే లింకన్ ఎంతో వినయంగా" మానాన్న నేర్పిన విద్య ఇది.మీ షూస్ కి రిపేర్ చేయాల్సివస్తే నేను చేస్తాను " అనేప్పటికి ఆవ్యక్తి సిగ్గుతో తలొంచుకున్నాడు.గర్వం అహంకారంతో ఈసడిస్తే
మనం మౌనంగా ఉంటే మంచిది.
కామెంట్‌లు