అష్టాక్షరీ గీతి,కవితా ప్రక్రియ:- 🚩జయ కృష్ణ! కృష్ణ ప్రియ! :- యలమర్తి మంజుల.,
   దేవకి గర్భంన పుట్టి
   యశోద ఇంట పెరిగి
   బృందావన విహారివి!
   జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
            🪷(2)
  ఆలమందను కాపాడి
  కాళీయుని గర్వభంగం
  కావించి, నర్తించినావు!
  జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
         🪷 (3)
    నంద నందనుడ వీవు
    గోకుల ముద్దుల పట్టి!
    అల్లరి కిట్టయ్య నీవు!
    జయ కృష్ణ!కృష్ణ ప్రియ!
             🪷(4)
    చక్రాసురుని వధించి
    పూతనను సంహరించి,
    గోకులంను కాపాడిన
    జయ కృష్ణ! కృష్ణ ప్రియ!
     
🔆కృష్ణం వందే జగద్గురుమ్!

కామెంట్‌లు