స్ఫూర్తి! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం జీవితచరిత్రలు బాగా చదవాలి.అందులో కొన్ని వాక్యాలు మనం ఒక పుస్తకం లో రాసుకుని అప్పుడప్పుడు చదువుతుండాలి. ఆచిన్న వాక్యాలు మన భావికి బంగారు బాటలు.గోదావరివరదలకు ఉభయగోదావరి జిల్లాలు సర్వనాశనం ఐనరోజులవి.రైతులఘోష తో కదిలిన మహానుభావుడు సర్.ఆర్థర్ కాటన్ దొర.గుర్రంపై ఎక్కిన ఆయన విగ్రహం ని జనం ఆరాధిస్తారు.ఆయనకు పిండప్రదానం చేసే మహానుభావులు ఉండేవారు.ధవళేశ్వరం ఆనకట్ట కోసం ఆనాటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తో పోరాటం చేశాడు.బాల్యంలో అన్నతో రోడ్డు పై నడుస్తూ కాలిబొటనవేలితో నదిలాగా కాలువలా గా 
గీతలు గీసేవాడు.ముఖ్యంగా వర్షం పడినప్పుడు
రోడ్ పై మట్టిలో అలా గీతలుగీస్తూ నదులు కాల్వలు గా ఊహించే వాడు.ఆంగ్లేయుల అధికారిగా పనిచేస్తూ గోదావరి ప్రాంతంలో గుర్రం పై స్వారిచేస్తూ 
ప్రజలకష్టాలు తెలుసు కున్న మహానుభావుడు.
వరదల్లో జనాలు చస్తుంటే మీనమేషాలు లెక్క పెడ్తారు ఏంటి? అని ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ని
గద్దించాడు.తనపైఅధికార్లను నిలదీశాడు.జనాలందర్నీ ఒప్పించి ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం కాలువలు త్రవ్వించి గోదావరి జిల్లా లను ధాన్యాగారం గా మార్చాడు.ఆయనకు సహకరించిన వ్యక్తి అప్నన్న.సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం లో ఆనాడు వాడిన పనిముట్లు ఉన్నాయి.నీటిపారుదల ఇంజనీర్ కాటన దొర అపరభగీరథుడుతం డ్రి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని అమలుపరిచిన వ్యక్తులు ఎందరో ఉన్నారు.ఆతండ్రులు తమకొడుకులను అలా తీర్చిదిద్దారు.రవీంద్రనాధ్ టాగూర్ కి తండ్రి డబ్బులిచ్చాడు రైలు ప్రయాణం కి.కానీ రవీంద్రునికి ఓవ్యక్తి ఇలా సలహా ఇచ్చాడు " నీవు కుర్రాడి లాగ ఉన్నావు కదా! హాఫ్ టికెట్ వయసు తక్కువ అనిచెప్పి తీసుకో" అన్నాడు.రవీంద్రుడు పిల్లల హాఫ్ టికెట్ తో ప్రయాణం చేసి మిగిలిన డబ్బు తండ్రి చేతిలో పెట్టి జరిగిన సంగతి చెప్పాడు.ఆయన వెంట నే రైల్వే శాఖ వారి కి లేఖ రాసి మొత్తం పెద్ద వారి టికెట్ ధర చెల్లించాడు.అలాగేసచిన్ టెండూల్కర్
"నాన్నా! నేను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాను" అని అంటే ఆ తండ్రి ఇచ్చిన సలహా ఇది." 
బాబూ! నీ చుట్టు ప్రక్కల వారి కి సాయంతో పాటు మాటమంచితనంతో మెలుగు." సచిన్ దాన్ని గుర్తుపెట్టుకుని తన ఇంటినిర్మాణం చేస్తున్నప్పుడు తన చుట్టు పక్కల వారికి ఇలా పాంప్లెట్స్ పంచాడు" నాఇంటినిర్మాణం వల్ల మీ అందరికీ అసౌకర్యం కలుగుతోంది అని తెలుసు.దుమ్ము ధూళి చప్పుడు అనివార్యం.దీన్ని భరిస్తున్న మీకు సర్వదా ఋణపడి ఉంటాను." ఇదీ వినమ్రత వ్యక్తిత్వం .మనం గొప్పవారం అని చాటుకోవడం కాదు.అవతలివారిలో 
మనపట్ల ప్రేమ ఆప్యాయత కలిగిస్తే చాలు.జన్మధన్యం.ఇలాంటి విషయాలు పిల్లలకి చెప్పాలి.మంచితనం పరోపకారం శాశ్వతం.
కామెంట్‌లు