తిరుప్పావై ;- కొప్పరపు తాయారు
 =    🌻11వ, పాశురం 🌻
  కుక్క. అ వైక్కణంగల్ పలక అన్దుశట్రార్ తి
   అలళియచ్చెను  శెరుచ్చెయ్యుమ్ కుట్ర మొర్రిల్లాద
   కోవలర్తమ్ పోర్కొడియే  పుట్రరవల్ గుల్
   పునమయిలే. పోదరాయ్ శుట్రత్తు తోళిమా
   రెల్లారుమ్  వన్దునిన్  ముట్రమ్ పుహన్దు 
    ముగిల్వణ్ణన్  పేర్పాడు శిట్రాదే  పేశాదే
    శెల్వపెణ్ణాట్టి !  నీ ఎట్రిక్కు రంగమ్ పేరుళేలో 
    రెమ్బావాయ్!
 ఓ గోపకుల తిలకమా! ఓ చిన్నదాన! లేత వయసు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. సమూహాల పాలు పిదుక తగిన వారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారు, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దాన! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా!ఓ వనమయూరమా ! రమ్ము నీ సఖులు, బంధువులను, స్నేహితులను అందరూ వచ్చి నీ వాకిట నిలచి ఉన్నారు వీరందరూ నీలి మేఘమును బోలు శరీర కాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. అయినను నీవు మాత్రము చెలించక, మాట్లాడక.  ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు. అనగా (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణుని సంశ్లేష అనుభవానందమే కదా! మరి ఈ సంశ్లేషానుభవానందమును నీ ఒకతెవె కాక అందరను అనుభవించునట్లు చేయవలె కాన, మా గోష్టిలో కలసి ఈ వ్రతమును పూర్తి గావించుము అనుచున్నారు.
           🪷*****🪷******🪷

కామెంట్‌లు