పిల్లల భక్తి (బాల గేయం);- ఎడ్ల లక్ష్మి
పార్వతి పాపా వచ్చింది
ఊరు వాడ తిరిగింది
ఉసిరికాయలు తెచ్చింది
ఊర్మిళనామో పిలిచింది !

ఊరు పక్కకు వెళ్లారు
ఊడలమర్రిని చూశారు
ఊడల ఊయల ఊగారు
ఉరుకులు పరుగులు తీశారు!

శివుని గుడికి చేరారు
ఉసిరికాయలు తీసారు
సమరువత్తులు వేశారు
కార్తీక దీపాలు వెలిగించారు !

గణ గణ గంటలు ఊపారు
ఓంకార శబ్దం చేశారు
చేతులు ఎత్తి మొక్కారు
శంకరుని వారు చూశారు !


కామెంట్‌లు