ప్రాచీ ధబల్ దేబ్! అచ్యుతుని రాజ్యశ్రీ

 కేకులు పేస్ట్రీల తయారీలో ఆమె మకుటంలేని మహారాణి.కన్ఫషెనరీ రంగంలో రికార్డు సృష్టించింది.కేక్ తయారీ అలంకరణ కి ఎంతో ఓపిక శ్రద్ధ డబ్బు కావాలి.పూణే నివాసి ప్రాచీ ఇటలీలోని మిలాన్ చర్చీకోసం100 కిలోల కేక్ తయారు చేసి2022లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఆమె పేరు ఎక్కింది.ఒక నెలలోపే తయారు చేసింది. ఆకేక్ లో 1500 విడిభాగాలు జోడించటం ఓఅద్భుతం.6.5 అడుగులు పొడవు 4.5 అడుగుల ఎత్తు 3.9 అడుగుల వెడల్పు చేసింది.కలకత్తా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన ఈమె జాబ్ చేసింది కొన్నాళ్ళు.బేకరీ చిత్రాలు గీయడం తో ఉద్యోగం కి గుడ్ బై చెప్పింది.ఆమె ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ అవార్డు విన్నింగ్ కేక్ ఆర్టిస్ట్.2012లో ఓ పార్టీ కోసం కేకులు తయారు చేసిన ఆమె ఇలా అంటుంది " ముందు అందరం బాగా చదివి డిగ్రీ పొందాలి.ఆపై మన హాబీ లో తర్ఫీదు పొంది అప్పుడు జాబ్ మానేయాలి." 🥧🎂
కామెంట్‌లు