పిల్లలు అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి- ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 
మధ్యాహ్న భోజనం విరామం అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు ఆశ్రునివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు నరెడ్ల సునీత మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల పిల్లల్లో విషయాలవారీగా సామర్థ్యాల సాధన జరుగుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆమె కోరారు.  అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ బాల్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే
ఉన్నత చదువులు చదివారని, ఇప్పుడు ప్రపంచమేధావిగా, భారత రాజ్యాంగ పితగా పేరు గడించారన్నారు. పాఠశాల పిల్లలు అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని బాగా చదివి, ఉన్నత స్థానంలో నిలవాలని ఆయన కోరారు. అంబేద్కర్ లాంటి మహామహులు,  ప్రపంచమేధావులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారని, పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. అనంతరం పిల్లలకు స్వీట్లు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు, ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విజయ్ కుమార్, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు