సుప్రభాత కవిత ; -బృంద
నిస్సత్తువకు చైతన్యమై
నిరాశ మోడు చివర చిగురై
అశాంతిని తరిమేసే ఆశాకిరణమై
అసంతృప్తిని మరిపించే శాంతమై

సర్దుబాటు నేర్పే సహకారమై
సాన్నిహిత్యం ఇచ్చే ధైర్యమై
దైన్యం ఎరుగని ధీరత్వమై
లోటెరుగని ఆత్మవిశ్వాసమై

దిక్కు తోచని స్థితి కి చుక్కానియై
పెక్కు బాధలు తీర్చు ప్రశాంతమై
మొక్కవోని దీక్షకు ప్రోత్సాహమై
రెక్కలేవో మొలిపించు స్థైర్యమై

అవసరాలు తీర్చే అక్కరై
అవకరాలు సరిచేసే  గురువై
అప్రమత్తం చేసే అనుగ్రహమై
అహర్నిశం వెలిగే ఆత్మజ్యోతివై

అనుదినం క్రమం తప్పక
అనుక్షణం కంటిరెప్పగ
అడుగడుగునా వీడని తోడై
అహరహమూ కాచే నీడై

ఆవిర్భవించి అనుగ్రహించే
అంతర్యామికి అంజలి ఘటిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు