క్షిపణి(బాలపంచపది)-ఎం. వి. ఉమాదేవి
సంఖ్య -955
----------------
ఆకాశవిజయాలు దేశానికీ
అల్లంతదూరాలు దగ్గరకీ
రక్షణనిచ్చేను అందరికీ
క్షిపణిఅస్త్రం బలమెన్నటికీ
దేశపు అమ్ములపొది ఉమా!

అంచెలుగా క్షిపణినిర్మాణము
ఆపైన క్షుణ్ణంగా శోధనము
లోపాలు సవరించు విధానము 
అత్యంత ప్రతిష్ట ప్రయోజనము
అగ్రరాజ్యముల సరసన ఉమా!

క్షిపణి శాస్త్రపరిశోధనలు
స్వయంప్రతిపత్తి బలాలు
పరిశోధకుల పట్టుదలలు
కలామ్ గారివీ ఆశయాలు
భారతదేశం ఘనత ఉమా!

స్వీయ రక్షణ అవసరము
పౌరులకు ఆత్మవిశ్వాసము
యువతసాగే రక్షణ రంగము
భావితరాలకి ఆదర్శము
ఆకాశ్ క్షిపణి ఘనమె ఉమా!!

కామెంట్‌లు