తిరుప్పావై;- కొప్పరపు తాయారు
  🪷3వ. పాశురం🪷
=============
   ఓంగీ  యులగళన్ద  ఉత్తమన్. పేర్పాడి  నాంగళ్
  నమ్బావైక్కు చ్చాటి  నిరాడినాల్  తీంగన్రి
   నాడెల్లామ్  తింగళ్  ముమ్మారి పెయ్ దు  ఓంగు
   పెరుమ్   తెన్నెల్.  ఊడు  కయలుగళ పూంగువళై
  పోదిల్. పొరివెణ్ణు. కణ్పడుప్ప. తేంగాదే
   పుక్కిరిన్దు  శీరెత్తములై  పట్టి వాంగక్కుడమ్
    నిరైక్కుమ్  వెళ్ళల్  పెరుమ్బ శుక్కళ్  
    నీంగాదె  శెల్వమ్  నిరైన్దేలో  రెమ్బవాయ్ !
   ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే!
అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి
 కూడా ఫలితం కలుగుతుంది.
 బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తు ఎదిగి మూడు లోకాలను కొలిచాడు.
    ఆ పరమానందమూర్తి దివ్యచరణాలును, అతని దివ్య నామాలను పాడి, ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానానాచరిస్తే దుర్భిక్షం అసలు కలుగనే కలుగదు. నెలకు  మూడు వర్షాలు
కురుస్తాయి.పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుగదిగి ఫలిస్తాయి.
            
       పంట చేల మధ్య నీటిలో పెరిగిన చేపలు 
త్రుళ్ళి పడుతూ ఆనంద సమృద్ధికి సూచిస్తాయి.
ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన బ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే! ఇక పాలు పితుక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండునట్లు క్షీర ధారలు అవిరులంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతానిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోదా!
                        ******

కామెంట్‌లు