నవంబర్! అచ్యుతుని రాజ్యశ్రీ

 టీచర్ ఆరోజు జి.కె.ప్రశ్నలు అడుగుతూ నవంబర్ లో ముఖ్యమైన విషయాలు ఏంజరిగాయి?" శివ అన్నాడు" హర్యానా కి చెందిన 8 వక్లాస్ విద్యార్థి మయాంక్ 14 ఏళ్ల అబ్బాయి కౌన్ బనేగా కరోడ్ పతిలో కోటి రూపాయలు గెలిచాడు" అనగానే" అబ్బా!" అంటూ చప్పట్లు కొట్టారు పిల్లలు."ఆపిల్లాడు చెప్పిన జవాబు ఇది.అమెరికా అని పేరు పెట్టి దాని మ్యాప్ తయారు చేసిన వాడు వాల్డ్ సీ ముల్లర్". అంతే అమితాబ్ బచ్చన్ తో సహా గర్వంతో ఉప్పొంగారు.ఇకదేశంలోనే తొలి సారిగా స్క్వాడ్రన్ లీడర్ మనీషాపాడీ మిజోరం గవర్నర్ ఎడిసిగా నియమింపబడిన తొలి మహిళ.ఇకమూడో అద్భుతం ఉత్తరాఖండ్ లోని సిల్ క్యారా సొరంగం నుంచి 41మంది కూలీలు 17 రోజులు గడిపి బైటపడటం! వారంతా కల్సి యోగా చేయడం నడవటం రాళ్లు నుంచి కారే నీటిని తాగారు.గొట్టంద్వారా అన్నం పప్పు ఎండు ఫలాలు మరమరాలు తిన్నారు.మైక్లో కుటుంబాలతో మాట్లాడే వారు.ర్యాట్ హోల్ బృందం సాధిం చిన ఈవిజయం మహా అద్భుతం.టి.వి.చూసినా మర్చిపోతాం.రోజూ పేపర్ చదివి ఇలాంటి వార్తలు ఒకనోట్ బుక్ లో రాసి బడిలో క్లాస్ లో చదివి వినిపించాలి" టీచర్ మాటలు విన్న పిల్లలు అలాగే అంటూ తలాడించారు🌹
కామెంట్‌లు