పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి- ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో రెండవ తరగతి బాలుడు ఇనుగాల ఆదిత్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య గత పదేళ్లుగా ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న బాలబాలికల పుట్టినరోజు వేడుకలను తన సొంత ఖర్చులతో ఘనంగా నిర్వహిస్తున్నారు.  మధ్యాహ్న భోజన విరామ సమయంలో కేక్ తీసుకువచ్చి  ఉపాధ్యాయినులు సమత, విద్యార్థినీ, విద్యార్థుల మధ్య ఆదిత్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాలుడు ఆదిత్యకు కేక్ తినిపించి, ఆశీర్వచనాలు అందించారు. బాగా చదువుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పాఠశాల పిల్లల ఆనందం కోసమే కాకుండా వారి రోజువారి హాజరు శాతాన్ని పెంచుతూ విషయాల వారిగా కనీస అభ్యసన స్థాయిలను మెరుగుపరిచేందుకు ఇలాంటి అనేక వినూత్న కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాల అభివృద్ధి, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  ప్రభుత్వ పాఠశాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కష్టపడి సంపాదించిన వేలాది రూపాయలను వృధా చేసుకోకుండా, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు కర్ర సమత, పిల్లల తల్లిదండ్రులు విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు