సుప్రభాత కవిత -బృంద
నీ ముందు వెలిగే దివ్వెను
నీ కోసమే విరిసే పువ్వును
నా బ్రతుకే నీ కానుక
నీ కరుణే  ఈ నా జీవిక

చిన్ని జీవితమే నాది
కొన్ని బంధాలే నావి
తల్లి తీగను అంటివుండి
రేకు విప్పిన మొగ్గను

ఏ కలతలూ లేవు
ఏ కోరికలూ లేవు
ఎవరి వల్లా నేను లేను
ఎవరి కోసమూ నేను కాను

ఎంత చక్కని జన్మ నాది
చింతలన్నది ఎరుగను
చెంత ఎవరూ లేకపోయినా
కొంతకాలమే నిలిచినా

ఈ జన్మకిది చాలు ప్రభూ
నిన్ను చేరుట నా ధ్యేయము
నీ చెంతనే నాకు ముక్తి
నేను నీకే అంకితం

అంటున్న పూబాల స్వగతంలో
పరమార్థమేదో తెలసుకుని

చేతిలోని క్షణం మాత్రమే 
నా సొంతమైన సంపదనీ
నిన్న రేపులు నావికావని
నా బ్రతుకే నీ బహుమతని

అంటున్న పూబాల స్వగతంలో
పరమార్థమేదో తెలుసుకుని
ఇహమునందు ఇనుడిని
అంతర్యామిగా ధ్యానించి

అంజలి ఘటిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు