సుప్రభాత కవిత ; -బృంద
శిలలాటి సత్యాలకు
కిరణాల ఉలితో 
వెలుగుల జీవం పోసే
వేకువ కావాలి

చినుకైన రాలని
బీడు నేలలను 
నీటితో నింపేసే వానంటి
వేకువ కావాలి

తుదిలేని కష్టాల తుదముట్టించే 
తులతూగు సంతోషాలు
వెల్లువగా వచ్చే వెలుగుల
వేకువ కావాలి

ప్రవల్లికగ మారిన 
ప్రతి మనసు చేసే యుధ్ధంలో
ప్రశాంతత నింపి గెలిపించే
వేకువ కావాలి

సమస్యల వలయంలో
సుడి చుట్టు కష్టాల
సోలిపోయిన మనసును
ఉత్తేజపరచే వేకువ కావాలి

గతాన్ని మరిపించి
ఆనందాలు కురిపించి
ఆరాటపడే హృదయాల వెలిగించే
వేకువ కావాలి

ప్రశ్నే సమాధానమైన
ప్రతి బ్రతుకు బాటలో
ప్రహేళికలకు ప్రతిగా ప్రమోదమిచ్చే
వేకువ కావాలి

లెక్కలేనన్ని వెతలు తీర్చి
మొక్కవోని దీక్ష అలవర్చి
చిక్కులన్ని విడిపించే మక్కువైన
వేకువ కావాలి

ఆశించినది అందించి
అనుగ్రహించే ఆదిత్యునికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు