సుప్రభాత కవిత - బృంద
కష్టాలు  అనుభవించాలి
కంటనీరు తిప్పుకోవాలి
కాలిముల్లు తీసుకోవాలి
ఆడుగు ఆపక సాగిపోవాలి

తగిలే గాయాలు తట్టుకోవాలి
ముక్కలైనా...మనసును
అతికించుకోవాలి
మాటల తూటాలు మౌనంగా
సహించాలి

ప్రతి అనుభవమూ ఒక పాఠం
ప్రతి  పాఠానికీ ఒక నిర్ణయం
ప్రతి నిర్ణయానికీ ఒక ప్రతిఫలం
ప్రతి పరిణామాలకీ సర్దుకునే గుణం

చిన్ని బ్రతుకులో ఎన్ని బంధాలో??
అన్నిటిలో కొన్ని ప్రత్యేకం
కొన్ని వదలలేనివైతే
కొన్ని వదలి పోనివి

సమస్యల ముళ్ళు దాటుకుంటూ
మనస్సున ముళ్ళు విప్పుకుంటూ
మమతలు  ముడి వేసుకుంటూ
సందేహాల ముడులు విప్పుకుంటూ

అడుగడుగునా ఆనందం
అనుక్షణం ఉత్సాహం 
అనుదినం ఉత్తేజితం
అనుపమం జీవితం

బ్రతకడం కాక జీవించే 
క్షణాలు తెచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు