అద్భుత బాలలు ! అచ్యుతుని రాజ్యశ్రీ
 కోవిడ్ టైంలో తండ్రి చనిపోయాడు.కానీ తల్లి ప్రోత్సాహం తో ఇండోర్ కి చెందిన తనిష్కా సుజిత్ 15ఏళ్ళకే బి.ఎ.పాసైంది.అదికూడా ఫస్ట్ క్లాస్ లో! సైకాలజీ బి.ఎ.చదివిన ఆమె 74.20%మార్కులు సాధిం చింది.బ్రిటన్ లో న్యాయశాస్త్రం చదవాలని ఆమె ఆశ.సుప్రీంకోర్ట్ లో కాలుపెట్టి తీరుతానని ఆమె నమ్మకం.ప్రధాని మోదీజీ ని కల్సింది.11వ ఏట10వక్లాస్ బోర్డ్ పరీక్షలు పాసైంది.తండ్రి సరిగ్గా 12వక్లాస్ ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో పోయారు.ఇంకా 2పరీక్షలు మిగిలాయి.అలాగే ధైర్యం చిక్కి బట్టుకుని చదివి పాసైంది.
ఇక 14ఏళ్ళకెరన్ కాజీ అనే బాలిక స్పేస్ ఎక్స్ కంపెనీ లో ఇంజనీర్ అంటే నమ్మబుద్ధి కాదుగదూ?తన 11 వ ఏటనే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థిని గా తన ప్రతిభను చాటింది.2వ ఏటనే టకటకా మాటలమూటలు దొర్లించింది.బడిలో టీచర్ పిల్లలకి తాను విన్న రేడియో ప్రోగ్రాంల గూర్చి రోజూ వివరంగా చెప్పేది.ఇలాంటి ప్రతిభ ఉన్న పిల్లలు దేశానికి ఎంతో అవసరం 🌹

కామెంట్‌లు