తిరుప్పావై ; - కొప్పరపు తాయారు
   🌻7వ, పాశురం🌻
    కీశు కీశ వైజ్ఞు మానై  చాత్తకలను! పేశిన 
     పేచ్చురవమ్. కేట్టిలైయో ! పేయప్పెణ్ణి !కాశుమ్ 
     పిరప్పుమ్  కలగలప్పక్కై పేరు! వాశ  నరుజ్జుళ్
     లాయిచ్చియర్  మత్తినాల్  ఓపడు రవమ్ 
     కేట్టి లైయో నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ 
మూర్తి  కేళవనై పాడవుమ్ నీ కేట్టే కిడత్తియో 
      తేశ ముడైయాయ్ !తిరువేలో రెమ్బావాయ్!
   ఓయీ! పిచ్చి పిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచు కీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా!
అదిగో! సువాసనలు వెదజల్లు తున్న కురులు గల గోపకాంతులు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు తిప్పుతూ కవ్వాలతో పెరుగు
చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినపడలేదా! నీవు మాకు నాయకురాలివి కదా! భగవద్విషాయానుభవము నెరిగిన దానవు  . సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడే. ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే
కేసి  మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణ గానం చేస్తున్నాము.
        ఐనా... వానిని వింటూనే ఇంకనూ పడుకునే ఉంటివా? మేము పాడే ఈ పాటల ఆనందంతో నీవు మెరసిపోతున్నావులే ! ఇకనైనను లేచి రామ్మాతల్లి!
వ్రతం ఆచరించడానికి ఇంకనూ ఆలస్యం దేనికి? అని ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.!!!
                   ***🪷*🪷***

కామెంట్‌లు