ముప్పై రెండవసారి రక్తదానం చేసిన డా. తెలుగుతిరుమలేష్

 ఒకరి రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు
రెడ్ క్రాస్ సోషల్ ఆక్టివిటీ జిల్లా కన్వీనర్ డా.తెలుగు తిరుమలేష్ తెలిపారు 

      నేడు ఆత్మకూరు పట్టణంలో ఎం.వి.రామన్ పాఠశాల అధినేత డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ గారి 60వ జన్మ దినవ సందర్భంగా ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో ఆ పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు, ప్రముఖ సామాజిక సేవ కులు,సాహితీ సేవకులు, రెడ్ క్రాస్ సోషల్ ఆక్టివిటీ జిల్లా కన్వీనర్ డా. తెలుగు తిరుమలేష్ గారు డిసెంబర్ 4వ తేదీన ఎం.వి. రామన్ పాఠ శాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్ 60వ జన్మదిన వేడుకలో 32వ సారి రక్తదానం చేసి అందరి చేత ప్రశంసలు అందుకు న్నారు. 
      ఈ సందర్భంగా వారు 32వ సారి రక్తదానం చేసినందుకు వారి సామాజిక సేవను అభినందిస్తూ వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఖాజా కుతుబుదీన్ గారు తెలుగు తిరుమలేష్ గారు 32వ సారి రక్తదానం చేసినందుకు వారికి 32వ సారి రక్తదాత సర్టిఫికెట్ ను ప్రధానం చేస్తూ ఆత్మీయంగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎం.వి. రామన్ పాఠశాల చైర్మన్ డాక్టర్ మొగిలి శ్రీధర్ గౌడ్, ప్రిన్సిపల్ ఆన్సి శ్రీధర్ గౌడ్ మరియు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా డా. తెలుగు తిరుమలేష్ మాట్లాడుతూ ఒక్కసారి రక్తదానం చేయడం వల్ల మరొక ముగ్గురి ప్రాణాలను కాపాడిన వారము అవుతాము మరియు మనము కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము అని వారు తెలియచేశారు. ఈ సందర్భంగా డా. తెలుగు తిరుమలేష్ కి పట్టణ నాయకులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు