అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం- అచ్యుతుని రాజ్యశ్రీ

 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
డిసెంబర్ మూడున !
సర్వాంగాలున్నా కుళ్లిన కూరలం ఫలాలం మనం
అష్టావక్రుడు అందరికీ ఆదర్శం!
వికలాంగుల ని చిన్న చూపు వద్దు
మనకన్నా ప్రతిభావంతులు!
రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో వారికి వారే సాటి
పారాఒలింపిక్స్ ఆసియా క్రీడలలో పతకాల పంటలు
అందించాలి వినికిడి యంత్రాలు మూడు చక్రాల వాహనాలు
నిరంతరం అవాకులు చవాకుల్తో మాటల ఈటెల్తో 
హింసతో కొట్లాటలు
దొమ్మీల్తో మన బతుకులు
ఇతరుల్ని ముంచే జిత్తులున్న
మనమే అసలుసిసలు వికలాంగులం!

కామెంట్‌లు