రైతు కల చెదిరే- పోరంకి నాగరాజు

 క్రమ సంఖ్య:
1026)
రైతు ఎండనక వాననక కష్టించెను
నారు వేసి నీరు పెట్టి కలుపు తీసెను 
చీడ పీడలు రాకుండా పిచికారి చేసెను
కంటికి రెప్పలా పంటలను కాపాడేను
చేతి కొచ్చిన పంట నీటి పాలాయె గోపాల!
1027)
చాపలా చుట్టెసాయి పంటపొలాలు 
పండిన పంట మొత్తం వరద పాలు
రైతు చేసిన కష్టమేమో, కన్నీళ్ల పాలు
అప్పులతో రైతు కుటుంబం వీధి పాలు 
విధాతను మరిచి మనిషి విన్యాసాలు 
గోపాల!
1028)
జన జీవనమంతా అస్తవ్యస్తం మయ్యెను
పండిన పంటలన్నీ వర్షార్పణం అయ్యెను.
రోడ్లన్నీ వర్షం నీటితో వరదపాలైయ్యెను
పల్లపు ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యెను
అన్నదాతను తుఫాన్ దెబ్బ తీసెను గోపాల!

కామెంట్‌లు