అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 తరువాత ప్రతాపరుద్రుని కోట  రహస్యాలను తెలుసుకోవాలన్న కోరికతో బయలుదేరబోతున్నారు శివనాగిరెడ్డి గారు  రెడ్డిగారు హైదరాబాదు నుంచి ఎన్నోసార్లు శ్రీశైలానికి కారులో వెళ్లారు కానీ శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరు గాంచిన ఉమామహేశ్వరం చూడలేదన్న విషయం తరచూ బాధిస్తూనే ఉంది నీటి ముంపు దేవళల తరలింపు కార్యక్రమంలో భాగంగా రెడ్డి గారు 1978 1981 మధ్య అలంపూర్ లో ఉద్యోగం చేసేటప్పుడు బాల బ్రహ్మేశ్వరాలయానికి వెళ్ళినప్పుడు  ప్రముఖ శాసన పరిశోధకుడు సాహిత్య వేత్త గడియారం రామకృష్ణ శర్మ గారు తరచూ ఉమామహేశ్వరం గురించి చెబుతూ ఉండేవారు అంతేకాదు ఉమామహేశ్వరంలో ఒకే పానవట్టం పైన రెండు శివలింగాలు ఉన్నాయని కూడా చెప్పారు.
ఇలా ఒకే పానవట్టం పైన రెండు శివలింగాలు మునుపటి కరీంనగర్ జిల్లా కాలేశ్వరంలో కాలేశ్వర, ముక్తేశ్వర పేరిట పూజ అందుకుంటున్నయని అలానే కర్నూలు సమీపంలోని పంచలింగాలలో బాదామీ చాళుక్యుల కాలానికి చెందిన ఒకే పానవట్టం పైన ఐదు శివలింగాలు ఉన్నాయని కూడా గడియారం రామకృష్ణ శర్మ గారు చెప్పారు రెడ్డి గారితో ఆయన చారిత్రక విషయాలను ఆసక్తికరంగా రాజుల పేర్లు అలవోకగా చెప్పడం చూసి ఆయనలా ఎప్పుడు నేను మాట్లాడగలను  అని అనిపిస్తూ ఉండేది రెడ్డి గారికి కాలేశ్వరం పంచలింగాల రెండు క్షేత్రాలు చూశారు ఉమామహేశ్వర మాత్రం చూడలేకపోయారు  ఒకనాటి సాయంత్రం శనివారం అనుకున్నారో లేదో  రెడ్డిగారు వారంతటి వారే ఒక్కరే తన డ్రైవర్ మురళితో కలిసి మరుసటి రోజు ఆదివారం ఉదయం నాలుగు గంటలకే బయలుదేరి ఐదు గంటల 40 నిమిషాలకల్లా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట చేరుకున్నారు. ఇంకా తెల్లవారలేదు రెడ్డి గారు చలి ఎక్కువగా ఉంది కొంచెం శరీరానికి వేడి తగ్గడానికి టీ తాగుదాం అనుకుంటే ఇంకా ఆ దుకాణాలు తెరవలేదు అచ్చంపేట ఊరు బయట కొంచెం సేపు అటు ఇటు తిరిగి ఉమామహేశ్వరం బయలుదేరి రంగాపురం చేరుకున్నారు  వేడివేడిగా చాయ్ తాగి ఉమామహేశ్వరం దారి అడిగి ప్రయాణం కట్టారు ఇంకా పొగ మంచు కురుస్తూనే ఉంది  గుట్టలు చెట్లు, బూజులు బూజులుగా కనిపిస్తున్నాయి ఇంతలో ఓ లంబాడి తండా వచ్చింది  లంబాడి మహిళలు వాకిళ్లు ఊడుస్తూ కళ్ళాపు జల్లుతూ ఉంటే మహానగరమైన మన రాజ్యం భాగ్యనగరం ఈ భాగ్యాన్ని కోల్పోయింది కదా అని అనిపించింది రెడ్డి గారికి


కామెంట్‌లు