ఆధ్యాత్మిక పద్యాలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
 కం.
ఎవని తలరాతనెవ్వరు
సవరింతురొ మరి యతండె సత్యము వినుమా
ధవళమ్మై  విస్తృతముగ
వివరణ శ్రీధరుడు జేయ విజయము మనసా!
తే.గీ
ఎవరి తలరాతనెవ్వరు సవరణగను
తీర్చువా డతడే శ్రీపతి మరి శ్రీక
రుండు సత్యము నిత్యము దండిగ ధర
తేజమౌచు వైకుంఠుడె ధీమ నొసగ
వచ్చును వినుమో మనసా! యవని సుతునిగఁ
ఉ.
ఎవ్వరి రాతనెవ్వరలు హేమముగా పరిమార్చువాడు వా
డెవ్వరు శ్రీకరుండుమరి డెందము నందముజేయ సత్యమై
నివ్వెర పోవురీతిగనె నిత్యము గర్వము దుంచువాడుగా
పర్వము దెచ్చుచుండునిల పాలనజేయుచు శాంతమూర్తి గన్

కామెంట్‌లు