గణతంత్రం! జన మంత్రం!;- డా. పివిఎల్ సుబ్బారావు,94410 58797.
 2024, జనవరి 26,
75వగణతంత్రదినోత్సవం.
శుభాకాంక్షలు అందిస్తూ --
=================
1.
  జాతిని ఏకం చేసే,
 రెండు మహోత్సవాలు!
 
  ఆగస్టు 15 ,బానిసత్వ,  
   విమోచన దినోత్సవం !
  జనవరి 26 ,పరిపాలన,   
   అవగాహన ఉత్సవం!
2.
స్వాతంత్ర్యం అర్థం !
ప్రగతికి అద్దం! 
హక్కులు పొందే యోగ్యత !
విధులు నిర్వర్తించే బాధ్యత !
3. పరిపూర్ణత గమ్యమా?
    నిరంతర ప్రయాణమే!
 
   కులం అంటే సేవకులం !
   మతం అంటే జనహితం!
 
  ప్రాంతం ఆసేతు హిమాచలం!
4. శక్తి యువశక్తి !
    
    భక్తి దేశభక్తి !
     
    ఆచరణ ధర్మం!
 
    ఆరాధన దేశం!
    జీవితం సమర్పితం!
 
   త్యాగమే అమృత తత్త్వం!
_________
శ్రీమతి కూరాడ వీరమాత,
డా. పివిఎల్ సుబ్బారావు,94410 58797.

కామెంట్‌లు