ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 విద్యా వినయ సంపన్నే బ్రహ్మ ణ గవి హస్తిని శునిచైవ స్వపాకేశ పండితః సమదర్శి నః  అన్న పలుకులు మీరు వినలేదా  అంటూ ఎన్ని విధాలుగా చెప్పినా వారు వినకుండా బయటకు పంపించారు. ఆ రోజుల్లో అందరూ కర్ణుడికి జరిగిన అవమానమే తనకు జరిగినది అంటూ ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నారు రాజుగారు  అక్కడి నుంచి అయోధ్యపురానికి వెళ్లి  రామ జన్మభూమిని పవిత్ర భూమికి పడి పడి మరొకరితో సరయు నదిని చేరి అక్కడ స్నానం చేశాడు పులకితగాత్రుడై పొంగిపోతూ హరిద్వార రిషికేశవ లలో గడిపి కాలినడకన పోయి కేదార నాయకులను దర్శించి మందాకిని నదిలో కృంగి పట్టు విడువక బదరీ క్షేత్రము చూసి బ్రహ్మకపాల పిండమును పెట్టి తండ్రిని పితృదేవతలను తృప్తి పరిచానంటు తల్లికి ఉత్తరము వ్రాశాడు. అప్పటివరకు తన కుమారుడు ఎక్కడ ఉన్నాడు ఏమైపోయాడో అని దుఃఖంతో ఉన్న తల్లి తన బిడ్డ వ్రాసిన లేఖను చూసి ఆనందంతో పొంగిపోయి బంధువులందరికీ ఆ లేఖను ఎంతో ప్రేమగా చూపి కొంచెం సేద దీరింది సంతోష జలధిలో.తర్వాత రాజుగారు గంగమ్మ పుట్టినగంగోత్రి ని చూసి యమున జన్మస్థలమైన యమునోత్రిని చూసి అలకనంద నదిలో స్నానమాడి భాగీరధీనది ప్రయాగలో  దివ్యములైన ఓ శక్తి తేజముల తోడ తీరైన శిఖరాగ్రతను కాంచి  శ్వేత తనయ ధవళ సీత నగములను చూసి కైలాసగిరి కి  ప్రేమతో నమస్కరించి. గుహలలో నివసిస్తున్న యోగులను చూసి  వారికి పాదాభివందనం చేసిన తర్వాత సన్యాసులను చూసి వారికి సేవ చేసి  సాధు పుంగవులు ఇచ్చిన ఉపాసనలను నేర్చి నా జీవితం ధన్యమైంది అని మనసులో అనుకున్నాడు సీతారామరాజు  గంగా నది ఆకాశంలో విహరిస్తూ  భువికి దిగడానికి శివుని జటాజూటంలో ఎక్కి  నిలిచింది అని తాను విన్న మాటలను గుర్తు చేసుకున్నాడు  ఆ స్థలాన్ని గంగోత్రి  అని పిలుస్తారు  ప్రపంచ లోకాలన్నిటికీ ఆరాధ్య దైవమైనది యముని ముద్దుల చెల్లి యమునమ్మ  ఈ చోటనే అంటూ  ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు  పరమేశ్వరుని చేరి  పార్వతి దేవి ఇచ్చటే కాపురముండుట దీనికి కైలాసగిరి అని నామకరణం చేశారట  ఎందరో ఋషులు ఇక్కడ ఉంటారట  అని ఉప్పొంగిపోయాడు.
కామెంట్‌లు