జానకి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 హనుమంతుడు లంకను జయించి తన స్వామికి విజయ వర్తమానాన్ని అందించాలి అనుకున్నాడు  తన మనసులో కూడా విజయచంద్రికల్ని పొందగలిగాడు శారీరక మానసిక ఆధ్యాత్మికపరమైన మహా సౌందర్యమే సుందరకాండ దర్శనంగా సార్థకత సాధించి సారా గర్భితమైనది  జానకి సౌందర్యానికి ముగ్ధుడైన రావణుడు ఆమె పట్ల ఎటువంటి దుష్ప్రవర్తనను చూపుతాడు అనే విషయం పైనే హనుమంతుని దృష్టి కేంద్రీకరించబడి ఉన్నది జానకి రావణుని పట్ల ఎటువంటి ప్రతి క్రియకు పోతుందో అది చూడాలని ఉత్సాహపడుతున్న హనుమంతుని దృష్టి జానకిపై ఉన్న జానకి దృష్టి హనుమంతునిపై లేదు ఆమె దృష్టి నాకర్షించడానికి హనుమంతునికి పట్టిన సమయంలో అతను అనుభవించిన మానసిక స్థితిని మనం వర్ణించలేం. కానీ ఎప్పుడైతే జానకి హనుమంతుని వైపు చూసిందో హనుమంతుడే తన నిర్మలమైన మనసును గురించి పరిశుద్ధ ఆశయాన్ని గురించి చెప్పడం దాని ద్వారా ఆమె విశ్వాసాన్ని చూరగొన వలెనని  ప్రయత్నించాడు

. ఆమె విశ్వాసాన్ని తాను చూడకున్న తర్వాత తాను చూసినది అన్వేషించినది ఏమయినా అను సందేహం కలిగింది అయినా ఆమెను తన భుజస్కాంతాలపై మోసుకొని శ్రీరామచంద్రుని వద్దకు తీసుకొని పోతానని జానకితో చెప్పాడు కారణం రావణుడు తనను అపహరించి ఇక్కడికి తీసుకొని వచ్చాడు మళ్ళీ అదే విధంగా పారిపోవడం  ఆమెకు ఇష్టం లేదు రాముడు వచ్చి రావణుని ఎదిరించి అత్యంత శౌర్య పరాక్రమ సమోపేతంగా గౌరవంగా తనను రాముడు తీసుకొని వెళ్ళాలని తన అంతరంగాన్ని వెల్లడించింది  ఆ మాటలు విన్న హనుమంతుడు జానకి నిజ స్వరూపాన్ని దర్శించి రాముని చేరి సీతమ్మను కనుగొన్న గుర్తుగా ఒక చూడామణి సీతమ్మను హనుమంతుడు అడిగి తీసుకున్నాడు.హనుమంతుడు తోకకు నిప్పు అంటించుకుని లంకను భస్మి పటణం చేయాలని భావించిన తరుణంలో జానకి పరిశుద్ధ అంతరాత్మ మనకు ప్రస్ఫుటంగా గొచరిస్తుంది కోపం వల్ల తొందర పాటులో చేసే పని ఇటువంటి ప్రమాదకర అనుచిత కార్యాల్లో తన ప్రమేయం ఉండకూడదనే తలంపుతో దూర దృష్టితో జానకి ఉద్యాన వణంతో ఉండి పోయింది లంక దహనం పూర్తయిపోయింది కానీ సీతమ్మ సురక్షితంగా ఉంది సీతమ్మ  పవిత్రతే తనను కాపాడినదన్న నిష్ఠుర సత్యాన్ని వివేకశీలుడు అర్థం చేసుకోగలరు ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే వాల్మీకి మహర్షికి జానకి తప్ప మరే విధంగా నువ్వు కనిపించలేదు కానీ ఆయన సుందరకాండను సుస్థిరం  చేసింది జానకి లోని శ్రేష్ఠ సౌందర్య రూపం.
కామెంట్‌లు