ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 సభలో గుసగుసలు దానికి తగ్గట్టే ఆమె ప్రసంగం కూడా ఉంది  అక్కడ రాఘవాచారి గారి విలువ నాకు అర్థం అయింది  సభ నిర్వహించడంలో ఎంత శ్రమ పడాలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో  నిరూపించారు. ఆయన  నిజానికి పంచ కావ్యాలు పాఠం చెప్పుకున్న కుటుంబంలో నుంచి వచ్చి మార్స సిద్ధాంతానికి ప్రభావితుడై మార్స్ కే పాఠం చెప్పగల సత్తా కలవారు రాఘవాచారి గారి పాత్ర సామాన్యమైనది కాదు  కాళిదాసు నాటకం ప్రదర్శించడం అలా ఉంచి దాని అనువాదం పాత్రల ఎన్నిక ఎంత కష్టమో  కథానాయిక కోసం బంగ్లాదేశ్ నుంచి ఆమెను పిలిపించి అక్షరాలను  నేర్పడానికి తాను ఎంత కష్టపడ్డాడో  కృష్ణ గారు చెప్పి ఈ నాటకంలో ఒప్పులన్నీ కాళిదాసువి  తప్పులన్నీ నావి అన్నారు. ఆ తర్వాత అరుణా వ్యాస్ మాట్లాడుతూ నాకు ఈ నాటకాలు నచ్చవు షేక్ స్పీయర్ తప్ప మరో నాటక కర్త ప్రపంచంలో లేడు అన్న ధోరణిలో మాట్లాడుతూ కొన్ని సందర్భాలను ఉదహరించడానికి చెబుతూ చెబుతూ మధ్యలో ఆగిపోతే ఆ వాక్యాలను రాఘవాచారి గారు గుర్తు చేయడం సభలో ప్రేక్షకులు పసిగట్టారు  కొటేషన్ లన్నీ ప్రారంభించడం మర్చిపోవడం నాకు ఆచారి గారు అందించడం ఆవిడ చెప్పదలుచుకున్న అభిప్రాయాల పై ఆవిడకి పూర్తి అవగాహన లేదు చాలా హాస్యంగా బాధగా మాట్లాడాడు కృష్ణ గారు  అందరి మన్ననలను పొందాడు చూడమ్మా నీవు చాలా అందంగా ఉన్నావు ఇంతమంది మగవాళ్ళ మధ్య  మెరిసిపోతున్నావు నీలాంటి వాళ్ళు రంగస్థలం మీదకు వస్తే ప్రేక్షకులు కూడా విరగబడి వస్తారు షేక్స్పియర్ నాటకాలు మేము చదివాము ప్రదర్శించాం కూడా మన గురజాడ కాళిదాసు మీకు తెలియదంటే తెలుగుదనానికే అపమానం పరభాష నాటకాలను కించపరచడం లేదు మన నాటకాలను చదవమని మాత్రం అభ్యర్థిస్తున్నాను అంటూ ఉండగానే కృష్ణ గారు నన్ను అవమానించకండి నేను  సత్యనారాయణ గారి శిష్యురాలిని అనేక విషయాలను ఆయన ద్వారా తెలుసుకున్నాను అన్నది. కృష్ణగారు మళ్లీ మాట్లాడుతూ చూడమ్మా మన సభకు వచ్చిన పెద్ద మనుషుల కాలాన్ని వృధా చేయవద్దు షేక్స్పియర్ నాటకాలకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాఖ్యలు రాసిన వారు ఉన్నారు దురదృష్టవశాత్తు మనకు వ్యాఖ్యలు చాలా తక్కువ మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు చేతనైతే అందమైన వ్యాఖ్యలు చేయండి కువిమర్శలు మాత్రం వద్దు అని మనవి అంటూ ధైర్యంగా మాట్లాడారు ఆయన గుండె ధైర్యము నాకు నచ్చింది. ఆ విషయం చెప్తే అంత మొండి మనిషి నాటక రంగానికి రావడం మన అదృష్టం అండి ఎంతమందికి సాయిపడ్డారో మీకు తెలియదు ఎన్ని నాటకాలను వెలుగులోకి తీసుకొచ్చారు అని వారితో తనకు సన్నిహిత సంబంధాలను చెప్పుకొచ్చారు సి.వి సూర్య నారాయణ గారు.

కామెంట్‌లు