నీ రాకతో ఈ వనమే వెలిగెను
నీ పద ధూళితో పావనమొందెను
నను దయ జూడగ వచ్చితివా....
ప్రభూ........నీలమేఘశ్యామా........ రామా
ఎన్ని యుగాలని వేచితినో
ఎన్ని ఫలాలను దాచితినో
ఈ ఫల వనము నీకోసం
ఈ నది అమృతం నీకోసం రామా
నీ రాకతో ఈ వనమే వెలిగెను!!
ఈ శబరి తపము ఫలియించే
నా రాముని కనులారా గాంచితి
తీయని ఫలముల రుచి చూసి
యిచ్చితి రామా నా జన్మ ధన్యమాయేగా ......
!! నీ రాకతో ఈ వనమే వెలిగెను!!
అయోధ్యాపురి విడువకు రామా
ఈ మానవులను కాపాడు
సకల జీవుల గావగా నీవు
మళ్ళీ అవతరించితివా దశరథ రామా
!! నీ రాకతో ఈ వనమే వెలిగెను!!
శరణు శరణు ఓ సీతారామా
శరణు శరణు ఓ రఘురామా
ఈ శబరి మాట విను ఓ రామా
రామరాజ్యం మళ్ళీ స్థాపించుమయా
!! నీ రాకతో ఈ వనమే వెలిగెను!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి