ఉడతాభక్తి;- -గద్వాల సోమన్న,9966414580
ఉసిరి చెట్టుపై చిట్టి ఉడత
గంభీరమే దాని నడత
చెంగు చెంగున ఎగురుతుంది
కొమ్మ కొమ్మకు తిరుగుతుంది

రామ సేతుకు సాయపడెను
ఉడతాభక్తి ప్రదర్శించెను
చలాకీగా ఉంటుందోయ్!
ఉసిరికాయలు తింటుందోయ్!

మూడు చారలు కల్గియుండును
తోక చూడగ పొడుగుండును
చిన్న ప్రాణి ఉడత సృష్టిలో
చెట్టుపైన వాసముండును

ఉడతాభక్తి చాలు చాలు
కల్గియుంటే మేలు మేలు
మంచి చేసే వారందరికి
కృతజ్ఞతలే వేనవేలు
.

కామెంట్‌లు