అనురాగమయి అమ్మ (వెన్నెలమ్మ పదాలు)- -గద్వాల సోమన్న,9966414580.
ఇంటి దీపము అమ్మ
ప్రేమ రూపము అమ్మ
మేలి బంగరు కొమ్మ
ఓ వెన్నెలమ్మ!

అమ్మ ఉంటే నవత
కుటుంబంలో ఘనత
పంచిపెట్టును మమత
ఓ వెన్నెలమ్మ!

అమ్మ మనసే వెన్న
సిరి సంపదల కన్న
సృష్టిలోనే మిన్న
ఓ వెన్నెలమ్మ!

అమ్మ ఉంటే జగతి
ఆమెతోనే ప్రగతి
లేకున్న అధోగతి
ఓ వెన్నెలమ్మ!

నవ మాసాలు మోయు
కను రెప్పలా కాయు
అమ్మ సేవలు చేయు
ఓ వెన్నెలమ్మ!

ఇంటి దేవత తల్లి
మాట చూడగ మల్లి
లేత ద్రాక్షావల్లి
ఓ వెన్నెలమ్మ!


కామెంట్‌లు