ఆత్మీయత, అనురాగము...;- -గద్వాల సోమన్న,9966414580
ఆత్మీయత, అనురాగము
అన్యోన్యత, అభిమానము
అంకురిస్తే మోదము
అంతరిస్తే ఖేదము

ఆరాధన, ఆలాపన
ఆరోగ్యము,ఆనందము
ఆక్రోశము,ఆవేదన
అనారోగ్యము,అవరోధము

అభినందన,ఆలోచన
ఆమోఘము,అద్భుతము
అహంకారము,అవహేళన
అభివృద్ధికి తిలోదకాలు

ఆశయాల సాధనలో
ఆశ్రియితుల బాగోగులో
అందరూ ముందుండాలి
ఆదర్శం గుబాళించాలి


కామెంట్‌లు