అమూల్యమైన సత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
అడ్డంకులెదురైనా
అపజయాలు చుట్టినా
అధైర్యపడ కూడదు
అసహనం చూపరాదు

అన్యాయం జరిగినా
ఆపదలే వచ్చినా
ఆశయం ఆగరాదు
పోరాటం మానరాదు

అపనిందలు వేసినా
అసూయతో రగిలినా
ఆఖరి వరకు నిలవాలి
అనుకున్నది నెగ్గాలి

సాహసమే ఊపిరిగా
ఆకాశమే హద్దుగా
సాగాలోయ్! మున్ముందుకు
మిగలాలోయ్! సాక్షిగా


కామెంట్‌లు