అచ్చుల అక్షర గేయం;- -గద్వాల సోమన్న,9966414580
అ నగనగా ఓ అడవిలో నాలుగు 
ఆ వులు కలసిమెలసి ఉండేవి
ఇ లా ఉండగా  ఒక రోజు 
ఈ కానలోకి ఒక పులి వచ్చింది

ఉ న్నట్టుండి ఆవులపై పులి
ఊ రుకోక  దాడికి దిగింది
ఋ జు మార్గాన యోచించి,
ఎ దురు దాడి చేశాయి ఆ నాలుగు

ఏ మాత్రం ఊహించని గోవుల
ఐ కమత్యానికి పులి జడిచింది
ఒ రిగేదేమీ లేక అటునుంచి
ఓ టమితో నిష్క్రమించింది

ఔ రా! ఔరౌరా!! అంటూ
అం దరూ మెచ్చుకొన్నారు
ఆవుల ఐకమత్యాన్ని,
ఐకమత్యమే మహా బలమని


కామెంట్‌లు